మీర్జాoపేటలో నాగ దేవత విగ్రహం ప్రత్యక్షo అగ్నిధారన్యూస్ ( కాల్వ శ్రీరాంపూర్ ):కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జాoపేట గ్రామంలో గురువారం రోజు సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ ఆధ్వర్యంలో జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ట్రాక్టర్ తో భూమిని చదును చేస్తుండగా ఒక్కసారిగా భూమిలో నుండి అతి పురాతనమైన నాగ దేవత విగ్రహం ప్రత్యక్షం అవడంతో నిర్వాహకులు ఒక్కసారి సంబరమాచర్యలకు లోనయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగదేవత విగ్రహం ప్రత్యక్ష కావడం శుభసూచికం అన్నారు. సమ్మక్క సారక్క జాతర ముందు ఈ ప్రాంతంలో ప్రత్యక్షం కావడం సాక్షాత్తు సమ్మక్క సారక్క మహిమ అన్నారు .కాబట్టి ఆలస్యం చేయకుండా శనివారం రోజున దేశ వ్యాప్తంగా జరిగే వసంత పంచమి కార్యక్రమం రోజున నాగదేవత విగ్రహ ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా ప్రతిష్టాపన చేస్తామని , మండలంలోని ప్రజలందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనవలసిందిగా సర్పంచ్ పుప్పాల నాగార్జున రావు. సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ బుర్కా శ్రీనివాస్ ఎంపీటీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు.
