గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందే పథకాలు రద్దు కి సిఫార్సు చేస్తాం శ్రీరాంపూర్ సీఐ,రాజు
అగ్నిధార న్యూస్( శ్రీరాంపూర్ ): బుధవారం రోజున శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌన్సిలర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, కిరాణం మరియు పాన్ షాప్ యజమానులకు,ప్రజా ప్రతినిధులతో గంజాయి మరియు మత్తుపదార్థాల నియంత్రణ పై అవగాహన సదస్సు నిర్వ హించారు. గంజాయి సాగు చేసే రైతులకు ప్రభుత్వం నుంచి అందే పథకాలు రద్దు కి సిఫార్సు చేస్తామని శ్రీరాంపూర్ సీఐ బి. రాజు హెచ్చరించారు.. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. గంజాయి తాగడం వల్ల మత్తులో ఎంతటి నేరానికైనా తెగిస్తారని వివరించారు. గంజాయి సాగు చేసినా, నిల్వ చేసినా, సరఫరా చేసిన కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామని, పి.డి యాక్ట్ అమలు చేస్తామని, ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఇలాంటి వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని కోరారు. అందించిన వారి సమా చారం గోప్యంగా ఉంచుతామని, నగదు ప్రోత్సహకాలు ఇస్తామని స్పష్టం చేశారు. గంజాయి,మత్తు పదార్థాలు కలిపి విక్రయించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామన్నారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో గంజాయి సాగుచేస్తే వారికి రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను నిలిపివేయనున్నట్లు సీఐ రాజు హెచ్చరించారు. ప్రతి పౌరుడు గంజాయి సాగు, సరఫరా,నిర్మూలనను సామాజిక బాధ్యతగా భావించి అరికట్టేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు.అనంతరం గంజాయి సాగు, రవాణాను అరికడతామంటూ ప్రజా ప్రతినిదులతో, షాప్ లో యజమానులతో సీ.ఐ ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ.మానస,కౌన్సిలర్స్ , ప్రైవేట్ టీచర్స్, పాల్గొన్నారు.
