మృతుని కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్న ఎమ్మెల్యే
అగ్నిధారన్యూస్:( జగిత్యాల ):తెరాస కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే.రూరల్ మండల పొలస గ్రామానికి చెందిన టిఆర్ఎస్ నాయకులు, పౌలేస్తేశ్వర ఆలయ చైర్మన్ వీర్ల శంకర్ నిన్న హత్యకు గురికాగా ఈరోజు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహానికి పంచనామా పూర్తి చేసి పోలాసలో శంకర్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ .అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ పార్టీ మంచి కార్యకర్తను కోల్పోయిందని ,చిన్నచిన్న,తగాదాలకు హత్యలు చేసుకోవటం భాధాకరమని,శాంతియుతంగాపరిష్కరించుకోవాలని అన్నారు.
