సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్  ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ):బుధవారం రోజు  పెద్దపల్లి మండలం లోని తురకల మద్దిగుంట గ్రామంలోని.సమ్మక్క సారాలమ్మ జాతర పోస్టర్ ను  కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు .పెద్ద గుట్ట వద్ద నిర్వహించే,ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ చైర్మన్ శంకరయ్య పేర్కొన్నారు. ఈసందర్భంగా. తురకల మద్దిగుంట  సర్పంచ్ తంగేళ్ల జయప్రద-సంజీవ రెడ్డి, మాట్లాడుతూ ఫిబ్రవరి 16 నుండి 19 వరకు జాతర ఘనంగా నిర్వహిస్తున్నట్లు, తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజలందరూ తురకల మద్దికుంటలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరకి తరలిరావాలని పిలుపునిచ్చారు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులు మినీ మేడారంగా పిలవబడే తురకల మద్దికుంట జాతరకు వచ్చి సమ్మక్క సారక్క కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు.వైస్ ఎంపిపి ముత్యాల రాజయ్య, జాతర కమిటీ వైస్ ఛైర్మెన్ హనుమంతు మాట్లాడుతూ  కరోనా నిబంధనలు పాటిస్తూ అమ్మవార్లను దర్శనం చేసుకోవాలని పిలుపునిచ్చారు .పోలీస్ శాఖ , పర్యవేక్షణలో,  జాతర నిర్వహించబడుతుంది అని తెలిపారు. ఈకార్యక్రమంలో, చంద్రయ్య, వెంకట్, లక్ష్మయ్య, మాజీ ఎంపీటీసీ ముత్యాల రాం చందర్, మాజీ ఛైర్మన్ మల్లేశం తో పలువురు పాల్గొన్నారు.