అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ): జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ,శనివారం రోజు వసంత పంచమిని సరస్వతి మాత జన్మదిన వేడుకలను పురస్కరించుకొని, చదువు ఆనందించు, అభివృద్ధి చెందు ,అనే కార్యక్రమంలోభాగంగా,ఎస్ఎంసి చైర్మన్ కల్లిపెల్లి ప్రవీణ్, ప్రధాన ఉపాధ్యాయురాలు రమాదేవి, ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దపల్లి DEOమాధవి, పెద్దపల్లి మండలవిద్యాధికారి,సురేందర్,పాల్గొనిమాట్లాడారు. సమాజంలో చదువు ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరు చదువుకొని ఉన్నతంగా జీవించాలని, ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఉప్పురాజు, ఉపాధ్యాయులు
స్థానిక కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.
