అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి ): పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం ,మండల పరిషత్ కార్యాలయం ముందు భాగంలో ఉన్నటువంటి మినీ గార్డెన్ అందులో ఉండే గ్రీన్ గ్రాస్ వివిధ రకాల మొక్కలు పండ్ల మొక్కలు మండల పరిషత్ కార్యాలయానికి నిత్యం వచ్చిపోయే అటువంటి ప్రజాప్రతినిధులకు ప్రజలకి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి అదేవిధంగా కార్యాలయ సిబ్బంది కూడా ప్రశాంత వాతావరణంలో తమ తమ విధులను నిర్వహించుకోవడానికి అనువైన వాతావరణం నెలకొల్ప బడింది కార్యాలయం ముందు ఏపుగా పెరిగిన చెట్లు చూడముచ్చటగా ఉన్నాయి. చెట్లు మొదళ్లలో వేసినటువంటి రంగులు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
దీనంతటికీ ఎంపీపీ బండారి స్రవంతి, శ్రీనివాస్ ,ఎంపీడీవో రాజు ల ప్రత్యేక చొరవ ప్రధాన కారణమని కార్యాలయానికి వచ్చి పోయే వారు అనుకుంటున్నారు.
