అగ్నిధారన్యూస్ జగిత్యాల జిల్లా : జగిత్యాల జిల్లాలొ గత నెల 20 తారీకు రోజున మంత్రాల నేపథ్యంతో ఒకే కుటుంబానికి చెందిన మూడు హత్యలు కలకలం సృష్టించిన విషయం విదితమే, ఆ సంఘటన మరవకముందే,మరో గ్రామంలో ఎనిమిది మంది మంత్రాలు చేస్తున్నారని,   హెచ్చరిక ఫ్లెక్సీ జిల్లాలో కలకలం సృష్టిస్తుంది వివరాల్లోకి వెళితే….

రాయికల్ మం. జగన్నాథపూర్ లో మంత్రగాళ్ల పై ఫ్లెక్సీ కలకలం.,

గ్రామంలోని 8 మంది మంత్రగాళ్లు ఉన్నారని ? మాంత్రికుల పై హెచ్చరిక ఫ్లెక్సీని కట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. గ్రామంలో ని మాంత్రికులు మంత్రాలు ఆపకపోతే చంపేస్తామని ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన,  ఫ్లెక్సీ తో గ్రామ ప్రజల్లో ఒక్కసారిగా  భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామస్తులకు చేస్తున్న మంత్రాలు ఆప నట్లయితే ఎనిమిది మందిని చంపేస్తాం అని హెచ్చరిక ఫ్లెక్సీ తో గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.