అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):NTPC సంస్థ బూడిద కాలుష్యం వల్ల నష్టపోతున్న కుందన్పల్లి గ్రామస్తుల సమస్య పరిష్కారానికై రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ తలపెట్టిన పాదయాత్రకు పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత మద్దతు ప్రకటిస్తూ, ఈరోజు ఉదయం హుటాహుటిన ఢిల్లీ బయల్దేరి ఢిల్లీ లోని N.T.P.C CMD గురుదీప్ సింగ్ ని ఆయన కార్యాలయంలో కలిసి ntpc వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని,అందువల్ల నిర్వాసితులను సురక్షిత ప్రాంతాలకు మార్చి సహకారం అందించాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత రు కోరడం జరిగింది. ఈ సందర్భంగా గురుదీప్ సింగ్ రు సానుకూలంగా స్పందించి త్వరలో శాశ్వత పరిష్కారం చూపిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఆయన తెలిపారు.
