అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ అప్పన పేట గ్రామాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా ఎమ్మేల్యే దాసరి మనోహర్ రెడ్డి సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. రాఘవాపూర్ లో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామాల్లో ముఖ్యమైన మౌలిక వసతులలో ఒకటైన అంతర్గత రోడ్లు ప్రజల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం, జరుగుతుందన్నారు.ఈకార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, పార్టీ,మండలాధ్యక్షులు,మార్కు,లక్ష్మణ్, ఆర్కుటి రామస్వామి, ఆయా గ్రామాల, సర్పంచులు, ఎంపీటీసీలు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
■ అందుగుల పల్లి గ్రామంలో శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ భూమి పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాసరి.
అందుగుల పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ భూమి పూజ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, జెడ్పిటిసి రామ్మూర్తి ,ఎంపీపీ స్రవంతి శ్రీనివాస్, మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.
