డ్రైవర్ కుడి చెయ్యి తెగి కింద పడిపోయి, తీవ్ర గాయాలు..

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శనివారం ఉదయం 8:00 సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కుడిచేతి దండ చెయ్యి వరకు తెగిపడింది. స్థానికుల కథనం ప్రకారం వివరాల్లోకి వెళితే, విశాఖపట్నం నుండి చంద్రపూర్, కు AP 39 TX 4349 గల బొగ్గు లోడుతో లారీ కరీంనగర్ వైపు నుండి పెద్దపల్లిని దాటుతూ, పెద్దపల్లి శాంతినగర్ సమీపంలోని హనుమాన్ విగ్రహం వద్ద మూల మలుపును తిరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా లారీ డివైడర్ ని ఢీకొట్టి డివైడర్ పైనుంచి ఒకవైపుకు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో, డ్రైవర్ నీలం లింగస్వామి ( కృష్ణాజిల్లా చిల్లకల్లు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు ) కుడి చెయ్యి అక్కడికక్కడే తెగి తెగిపడింది. సమాచారం అందుకున్న పెద్దపల్లి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడ్డ లారీ డ్రైవర్ ని. పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.