ప్రతిమ ఫౌండేషన్ సేవలు సద్వినియోగం చేసుకోవాలి
– సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ):కరీంనగర్ లోని నగునూరు ప్రతిమ ఆసుపత్రి ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సఖి కేంద్రం కో ఆర్డినేటర్ స్వప్న అన్నారు. శనివారం సఖి కేంద్రం లో ప్రతిమ ఫౌండేషన్ మండల కో ఆర్డినేటర్ శివ వివరించారు. నిరుద్యోగ యువతి, యువకులకు వివిధ వాటిలో శిక్షణ ఇస్తున్నట్లు సూచించారు. ఈ సందర్భంగా సఖి కేంద్రం కో ఆర్డీనేటర్ స్వప్న మాట్లాడుతూ నిరుద్యోగ యువత కి అవగాహన కల్పించి ఉపాధి మార్గం పొందేందుకు సూచిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సౌజన్య, సమత, ఆశ్రీత, వనిత, శ్రీనివాస్ లు పాల్గొన్నారు.
