అగ్నిధారన్యూస్( పెద్దపల్లి ) : అయిదేండ్ల లోపు చిన్నారులందరికీ తప్పకుండా పోలియో చుక్కలను వేయించాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ నగేష్ శనివారం ఓ ప్రకటనలో కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలియో చుక్కలు చిన్నారుల్లో రోగనిరోధకశక్తిని పెంచి పోలియో జబ్బు రాకుండా కాపాడతాయని తెలిపారు. తప్పక చిన్నారుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుచుకోవాలన్నారు. ప్రభుత్వం నెల 27 న ఆదివారం నాడు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌లు, దవాఖానాలు, పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు సహా ప్రధాన కూడళ్ల వద్ద ఆరోగ్య సిబ్బంది పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. దీనిపై ప్రజలలో అవగాహన కలిపించేందుకు అందరూ రూ విస్తృతంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
