ప్రమాద బీమా చెక్కును మృతుని కుటుంబ సభ్యులకు అందిస్తున్న పుట్టమధుకర్.

అగ్నిధారన్యూస్( మంథని ):కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన టీఆర్ ఎస్ పార్టీ కార్యకర్త రాచకొండ కిష్టయ్య ప్రమాదంలో మరణించగా, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ ప్రమాద భీమా, ఇన్సూరెన్స్ కంపెనీ ,నుండి మంజూరైన చెక్కును  మంత్రి , టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు,

ఆదేశాల మేరకు ఆదివారం రోజు పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ ,పుట్ట మధుకర్ , స్వయంగా  కిష్టయ్య కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లి 2,00,000 /- ( రెండు లక్షల ) చెక్కును వారి  కుటుంబ సభ్యులకు అందజేసి మాట్లాడుతూ, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెన్నుదన్నుగా ఉండి కార్యకర్తలను సంరక్షించుకోవడంలో ఎప్పుడు ముందుంటుందన్నారు కష్టపడి  పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అదేవిధంగా ఆపద వచ్చినప్పుడు, అన్నీ మేమై మీ వెంట ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు  ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.