బాధితుడికి చెక్ అందిస్తున్న మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న యాదవ సంఘం నాయకులు
అగ్నిధారన్యూస్( ధర్మారం ):పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేట గ్రామములో ఆకుల భూమయ్య యాదవ్ కు చెందిన గొఱ్ఱెలు గత సంవత్సరం పిడుగు పాట తో మృతి చెందగా, శనివారం రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రభుత్వం ద్వారా2.85000 రెండు లక్షల ఎనభై ఐదు వేలు మంజూరు చేయించి,బాధితుడు భూమయ్యకు చెక్కను అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు భూమయ్య ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.భూమయ్యకు చెక్కును అందజేసినందుకు ధర్మారం, యాదవ సంఘం మండలాధ్యక్షుడు ఆవుల ఎలయ్య యాదవ్. మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.వారి వెంట మేడారం సింగిల్విండో చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి గ్రామ సర్పంచ్ చెనెల్లి సాయి గ్రామ ఎంపీటీసీ జానుగామ లక్ష్మి రాజయ్య పాల్గొన్నారు.
