అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ): సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో జిల్లా విద్యాధికారి మాధవి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ, పిల్లల్లో దాగి ఉన్న అంతర్గత విజ్ఞానాన్ని బయటికి తీయడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు. నేడు ప్రపంచం అభివృద్ధి చెందుతు, శాస్త్ర సాంకేతిక రంగాల వైపు పరుగులు తీస్తుంది అన్నారు. పిల్లలందరూ క్రమశిక్షణతో నాణ్యమైన విద్యను అందుకని ఉన్నత శిఖరాలను అందుకోవాలని సూచించారు. పదో తరగతి చదివే విద్యార్థులు  ఇష్టంతో కష్టపడి మంచి మార్కులతో  రాణించాలి అన్నారు. ఈ సందర్భంగా ఫిబ్రవరి 28 యొక్క ప్రాధాన్యత గురించి పిల్లలకు వివరించారు. ఫిబ్రవరి 28, 1928 న భారతీయ భౌతిక శాస్త్రవేత్త సర్ సి.వి.రామన్ ‘రామన్ ఎఫెక్ట్’ (రామన్ ఫలితం) కనుగొన్నారు. ఇందుకుగాను ఆయనకు 1930లో భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. రామన్ ఎఫెక్టు కనుగొన్నందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 రోజున జాతీయ సైన్సు దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అన్నారు. 1986 ఎన్సిఎస్టిసి నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్(ఎన్సిఎస్టిసి) ఫిబ్రవరి 28ని సైన్స్ దినోత్సవంగా గుర్తించాలని భారత ప్రభుత్వం అభ్యర్థించింది. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఎన్సిఎస్టిసి అనుమతించింది. ఆ రోజు నుంచి  ఫిబ్రవరి 28 ని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం అన్నారు. 1986 నుంచి  జాతీయ సైన్సు దినోత్సవాన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థలు, శాస్త్రసాంకేతిక సంస్థలు, వైద్యవిద్యా సంస్థలు, పరిశోధనా సంస్థల్లో, ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్యం, ప్రధానోపాధ్యాయులు ఆగయ్య, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.