“మహాశివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నల్ల”
అగ్నిధారన్యూస్( ఓదెల ): మంగళవారం రోజు ఓదెల మండలంలోని, పలు గ్రామాలలో నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాలలో ,నల్ల మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఉప్పరపల్లె గ్రామంలోని శ్రీ శివగట్టు మల్లిఖార్జున స్వామి దేవాలయం మరియు కనగర్తి,పొత్కపల్లి,మరియు గుంపుల,గ్రామాల్లోని శివాలయాల్లో, మహాశివరాత్రి సందర్భంగా ,ప్రత్యేక పూజలు చేసి స్వామి వారిని దర్శనం చేసుకొని మెుక్కులు చెల్లించుకున్నారు .ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు యువత ఆలయ కమిటీ సభ్యులు భక్తులు తదితరులు పాల్గొన్నారు.
