అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )అఖిల భారత యాదవ మహాసభలో, భాగమైన యాదవ అఫీషియల్ అండ్ ప్రొఫెషనల్స్ విభాగం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో యాదవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మారం తిరుపతి యాదవ్,
కాల్వ శ్రీరాంపూర్ ఎంపీపీ సంపత్ యాదవ్, ముఖ్యఅతిథిగా హాజరైన సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు సమావేశం కి హాజరైన జిల్లాలోని యాదవ మేధావి వర్గానికి చెందిన వారందరికీ ధన్యవాదాలు అన్నారు. ఈరోజు యాదవ కులంలో జన్మించడం గర్వకారణమన్నారు. శ్రీకృష్ణుని వంశానికి చెందిన మనం ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూన్నామన్నారు. యాదవులు అందరూ ఐక్యతగా ఉంటూ రాజ్యాధికారం దిశగా ప్రయత్నాలు చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా యాదవులు చేపట్టే కార్యక్రమాలు రాష్ట్రంలోని యాదవ కుల బాంధవులకు దిక్సూచి కావాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో, నూతన కలెక్టర్ వద్ద వెయ్యి గజాల భూమి యాదవ సంఘం భవన నిర్మాణానికి కేటాయించిన దాతలు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు, ప్రముఖ న్యాయవాది, మేకల మల్లేశం యాదవ్, తమ్ముడు బోయిన ఓదేలు, యాదవ్ కి సమావేశంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తదనంతరం జిల్లాలోని యాదవ న్యాయవాదులకు ఘనంగా సన్మానం చేశారు. .ఈ కార్యక్రమంలో Yopa జిల్లా ప్రధాన కార్యదర్శి కిషన్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నరసయ్య యాదవ్ ,మల్లేష్ యాదవ్ ,పద్మజ యాదవ్, మురళీధర్ యాదవ్, రవి కుమార్ యాదవ్, సదానందం యాదవ్, సతీష్ యాదవ్, సతీష్ కుమార్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, అజయ్ యాదవ్, రమేష్ యాదవ్, శివ కృష్ణ యాదవ్, సంతోష్ యాదవ్, రమేష్ యాదవ్ చంద్రమౌళి, యాదవ్ రవి కుమార్ యాదవ్, నరేష్ యాదవ్, కుమార్ యాదవ్, కుమార్ యాదవ్, రాజ్ కుమార్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
