ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన నల్ల మనోహర్ రెడ్డి .

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) ఆదివారం రోజు జిల్లా కేంద్రంలో  నల్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో….. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,నిజామాబాద్ ఎమ్మెల్సీ,  కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ,పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానములో జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున  నిర్వహించి,

పిల్లలతో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. అనంతరం అండర్-14 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభచారు. ఈ సందర్భంగా మనోహర్ రెడ్డి   మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత  జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి పిల్లలో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు పోటీలను నిర్వహిస్తున్నారు అన్నారు.. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తబ్రేజ్ ఖాన్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పాటకుల అనిల్, నల్లఫౌండేషన్ సభ్యులు,టోర్నమెంట్ ఆర్గనైజేషన్స్, యువకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..