అగ్నిధారన్యూస్( వరంగల్ )వరంగల్ జిల్లాలో త్వరలో జరుగబోయే కొమ్మాలా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి దేవస్థానం, బ్రహ్మోత్సవా సందర్భంగా సంస్కృతి ఫాండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.ఈ సందర్భంగా కొమ్మాల లక్ష్మీనర సింహస్వామి దేవస్థానము దగ్గర బ్రహ్మోత్సవాలలో వాడిన వృధా నీరు అంతటా బురదమయం అవుతుందని సంస్కృతి ఫౌండేషన్ ద్వారా 60(అరవై వేల) రూపాయల వ్యయముతో పైపులైను నిర్మాణము చేపట్టారు.జాతర సమయములో మంచినీటి సరఫరా, అన్నదాన కార్యక్రమములు చేయుటకు సంస్కృతి ఫౌండేషన్ సంకల్పించిందని చైర్మన్ నన్నెం . రాజ్యలక్ష్మి తెలిపారు.. మున్ముందు పలు సేవా కార్యక్రమాలలో సంస్కృతి ఫౌండేషన్ భాగస్వామ వహిస్తుందని. ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్. కక్కెర్ల శ్రీనివాస్ తెలిపారు.

