అగ్నిధారన్యూస్ ( నస్పూర్ ):శుక్రవారం సాయంత్రం శ్రీరాంపూర్ సింగరేణి జిఎం ఆఫీస్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం, ఢీ కొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో జైపూర్ మండలం ఇందారం, రామారావు పేటకు చెందిన ప్రసాద్ ,నరేష్ లు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి వచ్చి మృతదేహాలను పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.