అగ్నిధారన్యూస్ (  మంచిర్యాల  ):మంచిర్యాల- మందమరి రైల్వే లైన్ ల మధ్య గల ఎసిసి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో శనివారం రైలు కిందపడి గుర్తుతెలియని ఈ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు 40 సంవత్సరాలు వయస్సు ఉండి ఒంటిపై బ్లూ రంగు జీన్స్ పాయింట్, తెలుపు రంగు ఫుల్ షర్టు వేసుకున్నాడు. ఎడమ కాలుకు నలుపు రంగు దారం, కుడి చేతికి ఎరుపు రంగు దారం ఉంది. మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. మృతుని ఆచూకీ తెలిసినవారు. ఈ  సెల్ ఫోన్ నెంబర్లకి 9440900792,.  8328512176.   తెలియజేయవలసిందిగా జి.ఆర్.పి హెడ్ కానిస్టేబుల్ సంపత్ తెలిపారు.