పోస్ట్ ఆఫీస్ లేబర్ అడ్డ ఆవరణలో మాస్క్ దరించుట డ్రంక్ అండ్ డ్రైవ్ ట్రాఫిక్ నియమాలపై- అవగాహన కార్యక్రమం.
కళా బృందాల చే ప్రచార కార్యక్రమం పాల్గొన్న ట్రాఫిక్ ఎస్ఐ ఇసాక్.
అగ్నిధారన్యూస్ ( కరీంనగర్ )కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, ఐపీఎస్ డీఐజీ అదేశాలతో…ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…..మాస్క్ తప్పనిసరిగా ధరించాలని,భౌతిక దూరాన్ని పాటించాలని, కరోనా నియంత్రణలో భాగస్వామ్యలు కావాలని తర్డ్ వేవ్ రాకుండా ప్రతి ఒక్కరు , తగిన జాగ్రత్తలు పాటించాలని డ్రంక్ అండ్ డ్రైవ్, త్రిబుల్ రైడ్, రాష్ డ్రైవింగ్ చేయవద్దని హెల్మెట్, ధరించాలని, వాహనాల యొక్క నంబర్ ప్లేట్ ను ట్యాంపరింగ్ చేయొద్దని,రాంగ్ రూట్లో వెళితే,ట్రాఫిక్ రూల్స్ ఉల్లాంఘిస్తే ఈచాలన్ ద్వారా జరిమానాలు వేయడం జరుగుతుందని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహేష్ కానిస్టేబుల్ శ్రీనివాస్ కానిస్టేబుల్ మరియు మీ పోలీస్ కాళాబృందం పాల్గొన్నారు.
