అగ్నిధారన్యూస్ ( నస్పూర్ )మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీరాంపూర్ జి ఎం ఆఫీస్ ప్రాంతంలో తరుచు యాక్సిడెంట్ లు జరిగి చనిపోయిన ప్రదేశాలను జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల మేరకు శ్రీరాంపూర్ సీఐ రాజు ఎస్ ఐ మానస, ART TEAM సభ్యులు ఐనా MVI, NH, R&B, DE,AE,లతో కలిసి బ్లాక్ స్పాట్ ను సందర్శించి వారి సూచనల మేరకు రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి తీసుకోవలసిన చర్యల గురించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సమీక్షించి ప్రమాదాల నివారణ కు బ్లాక్ స్పాట్ వద్ద RCC రోడ్ సేఫ్టీ డివైడర్స్, ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, కోన్స్, రోప్స్ లను సీఐ రాజు ఎస్ఐ మానస లు ఏర్పాటు చేసినారు. ఈసందర్భంగా సీఐ రాజు మాట్లాడుతూ…….. మానవ తప్పిదం, అతివేగం అవగాహన రాహిత్యంతో వాహనాలు నడపడం వల్ల తరచుగా యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపినారు. హెచ్ కె ఆర్, ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ అధికారుల సమన్వయంతో ప్రమాదం జరిగిన మరియు బ్లాక్ స్పాట్స్ వద్ద ధర్మో ప్లాస్టిక్ పెయింట్స్, రేడియం స్టెడ్స్, బ్రింగ్ లెటర్స్, సైనింగ్ బోర్డ్స్,వేగ నియంత్రణ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే వాహనాలు సీజ్ చేస్తామన్నారు.

