✍️✍️✍️ సీనియర్ జర్నలిస్ట్ వెంకటాయోగి రఘురామ్ .
■ మరకతం వ్యక్తి యొక్క గౌరవ ప్రతిష్టలు పెంపొందిస్తుంది.
■ శ్రీ లక్ష్మీ గణపతి గ్రహం అరుదుగా కనిపించే విగ్రహం.
■ మరకత శ్రీ లక్ష్మీగణపతి స్వామి దర్శనం సకల పాప వినాశన మహా మంగళ ప్రదాయకం”.
అగ్నిధారన్యూస్( హైదరాబాద్ )మనకు ప్రకృతి సిద్ధంగా లభించే నవరత్నాలతో అత్యంత విలువైనది మరకతము (పచ్చ) రాయి. (ఈ రాయిని గ్రహబలాన్నను సరించి జన్మవృక్షణాల ఆధారంగా తన వేలికి ధరించిన వ్యక్తి సమాజంలో గౌరప్రతిష్టలు సాధించడమే కాకుండా ఆర్ధికంగా ఎంతో ఎదుగుతాడని హిందూ ధర్మ శాస్త్రము చెబుతున్నది. అలాంటి మరకతముతో మలచిన శ్రీ లక్ష్మీగణపతి విగ్రహము బహుశ ప్రపంచంలోనే అరుదు. అలాంటి విగ్రహాన్ని సికింద్రాబాదులోని ఖానాజిగూడ ప్రాంతంలో గత కొద్ది కాలం క్రితం వేద బ్రహ్మణుల మంత్రోచ్ఛారణల నడుమ ప్రతిష్టించారు. కొంగుబంగారమై, మహిమాన్వితంగా విరాజల్లుతున్న ఈఆలయానికి • ధర్మకర్తగా “వాచస్పతి” బిరుదాంకితులు డా॥ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి వ్యవహరిస్తున్నారు. అత్యంత మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని దర్శించుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. అలాంటి ఆలయం యొక్క విశిష్టత గురించి మీ ముందు.
భారతీయ ఆధ్యాత్మిక జగత్తుకు మూలాధారమైన వేదాలలో వర్ణించబడినట్లు ఆసేతు హిమాచలం వు నెలకొని ఉంది సమస్త విఘ్నాలను దూరం చేసుకోవడానికి, సకల అభిష్టాలను నేరవేర్చుకోవడానికి ఆదిమాజ్యుడై నిత్య పూజలందుకుంటున్న ‘గణవతి’ ఆరాధన ఉత్తమోత్తమం.
కలియుగాన అత్యంత శీఘ్రగతిన సర్వాలీష్టాలను నెరవేర్చుకొనుటకు ‘గణేశోపాసన” చాలా విశిష్టమైనది. అనేక పురాణ, ఇతిహాసాల్లో గణపతికి సంబంధించి వివిధ ఉపాసనలున్నా అందులో ‘మరకత శ్రీ ‘లక్ష్మీగణపతి ఉపాసన శ్రేష్ఠమైనది. మానవ జీవనంపై నవగ్రహాల దశవికర్దశ స్థితుల ఆధారంగా దుష్ప్రప్రభావాలను దూరం చేసుకోవడానికి నపర్శ, నవల్నీ, సవాహన మార్వల్ నవగ్రహ ఆరాధన బహుగదాయకం ప్రపంచంలో అరుదుగా ఇంతటి మహిమాన్వితమైన నవరత్నాలలో ఒకటైన అత్యంత విశిష్టమైన మరకతము (పచ్చ లేదా ఎమరాల్డ్)తో మలచిన శ్రీ లక్ష్మీగణపతి స్వామి ఖానాజిగూడు సికింద్రాబాద్ నందు ప్రతిష్టించబడి భక్తుల కొంగుబంగారమై మహిమాన్విత మూర్తిగా నిత్య పూజలు ధూపదీప నైవేద్యాలు, అర్చనలతో అలరారుచున్నారు.

శ్రీ ముద్దుల పురాణము ఆధారంగా “మరకత శ్రీ లక్ష్మీగణపతి”. అభిషేదము చతురావర్తన తర్పణము, హోమము, అర్చన ప్రదక్షిణాలు: మొదలగునవి ఆదరించినచో మానసిక చాంచల్యము, క్యాన్సర్, గొంతు,
చెవి, ధర్మవార్యుల నుండి ఉపశమనం, ఆర్థిక, కోర్టు, వివాహ ఋణబాధల నుండి విముక్తి, విద్య, విదేశీయాన, ఉద్యోగ, వివాహ అన్యోన్యదాంపత్యం పొందుదురని భక్యుల ప్రగాఢ విశ్వాసం. స్థల పురాణం, నల్లగొండ జిల్లా మోత్కూర్ గ్రామ వాస్తవ్యులైన డా సత్యనారాయణ శాస్త్రి దేవి ఉపాసకులు. వీరు ఒకానొక రోజు ఖానాజిగూడ మార్గంలో ప్రయాణిస్తుంటే ప్రస్తుతం ఉన్న ఆలయం సమీపంలో కొన్ని క్షణాల పాటు స్వామి వారి ప్రతిరూపం కనిపించడం ఆ తరువాత వారికి రాత్రి నిద్రలో స్వయంగా స్వామి దర్శనం ఇచ్చి ఆలయం నిర్మించమని చెప్పడంతో వారు తక్షణం నిర్మాణపనులు ప్రారంభించారు.
ఆలయ నిర్మాణాంతరం ఇదే మార్గంలో నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణంలో ప్రాచ కళాశాల సంస్కృత అధ్యాపకులు నటేశ్వర శర్మ ఈ ఆలయ దర్శించుకున్నారు. ఈ సమయంలో వారు | ఆశువుగా స్వామి వారిపై సుప్రభాతం పాడడంతో ప్రతి రోజు వారు రచించిన సుప్రభాతంలోనే స్వామి వారికి మేలుకొలుపు జరుగుతుండడం విశేషం. ఆలయ వ్యవస్థాపకులు, కార్య నిర్వాహకులు, లాల శాస్త్ర నిపుణులు, “వాచస్మృతి’ బిరుదాంకితులు బ్రహ్మ శ్రీ డా॥ మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి ఆధ్వర్యంలో విద్యవాహతాగ్నిలు. ఆచార్య చూడామణి, జ్యోతిరాస్తోర్యామవరాణి బ్రహ్మాకి పురాణం మహేశ్వర శర్మ వైదిక కార్యక్రమాలతో ఆలయం శోభిల్లుచున్నది.
రవాణా సౌకర్యం సికింద్రాబాద్ నుంచి ప్రతి గంటకు ఓ సారి బస్సు సౌకర్యం కలదు. ఈ బస్సు నెంబరు 23జీఎఫ్. ఇంతే కాకుండా ప్రతి నిత్యం ఆలయ సన్నిధానంలో సాయంత్రం రాజోపచార మాజలు, విశేష నీరాజనాలు, మహాత్ముల మంగళాశాసనాలు, భజనలు జరుపుతున్నాయి.
ఈ ఆలయంలో తరుచుగా యజ్ఞయాగాదులు జరుగుతుంటాయి ‘ఈ’ సమయంలో ఇక్కడికి విచ్చేసే భక్తుల సౌకర్యార్ధము ఉదయం అల్పాహారము, మధ్యాహ్నము భోజనము. రాత్రి వేళల్లో భోజ సదుపాయాలు ఆలయ నిర్వాహకులు సమకూర్చుతున్నారు. ఎంత భక్తిశ్రద్ధలతో విచ్చేసిన భక్త జనకోటికి ఎటువంటి అసౌకర్యము
కలగకుండా జాగ్రత్తలు పాటిస్తారు. “మరకత శ్రీ లక్ష్మీగణపతి స్వామి దర్శనం సకల పాప వినాశన మహా మంగళ ప్రదాయకం”.
