అగ్నిధార న్యూస్ (మంచిర్యాల):కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల పట్టణ అధ్యక్షుడిగా తూముల నరేష్ ను మంగళవారం తెలంగాణ బి సి జాగృతి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక హైటెక్ సిటీ లోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాతో సత్కరించి అభినందించారు ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ………. బిసిలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి జాగృతి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నరెడ్ల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్, ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్, యువ జాగృతి అధ్యక్షులు మాచర్ల సదానందం, నాయకులు విష్ణుభక్తుల సదానందం, గుంట అశోక్, నార్ల మహేందర్, మామిడాల ప్రకాష్, రంగు అశోక్, చింతకింది తిరుపతి, కొండపాక మచ్చయ్య, రామగిరి సత్తయ్య, కొల్లూరు భాస్కర్, గాజుల సుధీర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.