■ నిత్యావసర వస్తువుల ధరల తగ్గించాలి
■ విద్యుత్,rtc చార్జీల పెంపు రద్దు చేయాలి
■ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు సీపీఎం పెద్దపల్లి ఏరియా కమిటీ డిమాండ్
■ ఏప్రిల్ 3 న జిల్లా వ్యాప్త నిరసనలకు పిలుపు బత్తిని సంతోష్
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )గురువారం రోజు పీఎం పెద్దపల్లి ఏరియా కమిటీ సమావేశం పెద్దపల్లి కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ ఏరియా కార్యద్యర్శి బత్తిని సంతోష్ మాట్లాడుతూ…….. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై కక్షకట్టినట్లు విపరీతంగా ధరలు పెంచుతుందని, నిత్యావసర వస్తు ధరలను నియంత్రించి గ్యాస్,పెట్రోల్,డీజిల్ ధరలను వెంటనే తగ్గించుకోవాలి డిమాండ్ చేశారు,గత 10 రోజుల్లో రోజు పెరుగుతూ పెట్రోల్,డీజిల్ ధరలు శతకo దాటిందని అన్నారు.సామాన్య జనాలు జ్వరం, గుండె,బీపీ సంబంధిత వ్యాధులతో నిత్యం వాడే 850 రకాల మెడిసిన్ మందులపై 10శాతం వరకు రేట్లు పెంచడం వల్ల సామాన్యులకు వైద్యంతో పాటు మందుల భారం తీవ్రంగా పెరిగిందని అన్నారు.నిత్యం గృహ వినియోగానికి వాడే గ్యాస్ ధర ఒకేసారి రూ. 50 పెంచారని,ఇది 2014లో గ్యాస్ సిలిండర్ ధర 500 ఉంటే ఇప్పుడు అది రూ.1000 దాటిందని అన్నారు.కరోనా వల్ల జనాలు ఉద్యోగాలు ఊడి, ఉపాధి లేకుండా సతమతం అవుతుంటే ….బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఆర్థిక భారాలు మోపడం అన్యాయం అన్నారు.
కేంద్రం పెంచిన ధరలను అదుపు చేయడం మానేసి. మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం, అదే దారిలో విద్యుత్,ఆర్టీసీ చార్జీలను మోపుతూ రాష్ట్ర ప్రజలపై మరింత భారాలు మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు.ధరల పెరుగుదలకు ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని సాకుగా చెప్పడం సిగ్గుచేటని అన్నారు.అదే నిజమైతే దానికి ముందు ఎలా పెరిగాయని,ఎన్నికల సమయాల్లో ఎందుకు ధరలు తగ్గుతూ తటస్తంగా ఉన్నాయని,ఆతరువాత మళ్ళీ ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు.బీజేపీ అధికారం లోకి వచ్చాక అంతర్జాతీయ మార్కెట్ తో సంబంధం లేకుండా మొదటి ఏడాదే పెట్రోల్ పై పన్నుల ద్వారా 99వేల కోట్లు ఆదాయాన్ని సంపాదిస్తే ఈ ఏడాది మాత్రం ఏకంగా 4 లక్షల కోట్ల ఆదాయాన్ని ప్రజలపై భారాలు మోపి దోచుకుంటుందని అన్నారు.కానీ కార్పొరేట్లకు ఆదాయ రాయితీలు ఇస్తూ పేదోని చమటను దోపిడీ చేస్తుందని ఆవేదన చెందారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోపిడీ చేస్తున్నాయని,పేదోన్ని కొట్టి ఉన్నోడికి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎప్పటికైనా అటు కేంద్రం,ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్,డీజిల్,గ్యాస్, నిత్యావసర వస్తు సేవల ధరలను తగించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర,రాష్ట్రాలు అవలంబితున్న ఈ విధానాలపై సీపీఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఏప్రిల్ 3 న జిల్లా వ్యాప్తంగా ప్రజలు నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశానికి ఏరియా కమిటీ సభ్యురాలు జి. జ్యోతి అధ్యక్షత వహించగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ముత్యంరావు అతిధిగా హాజరయ్యారు.సమావేశంలో ఏరియా కమిటీ సభ్యులు అశోక్,సిపెళ్లి దిలీప్,మొదుంపల్లి శ్రావణ్, జె.ప్రశాంత్,ఎం.మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
