10.అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్ । పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితమ్ ॥

యుద్దొన్మాధం మొదలు
యుద్ధం మొదలు కాకనే,
యుద్ధవీరుల మరణం
నాయొక్క స్వార్థమని

అహం నిండిన ఆయోగ్య
వీర లక్షణంగా బయట
పడటమే కాకుండా..

కురు వృద్దుడు సర్వ
సైన్యాధ్యక్షుడు భీష్ముడు ఉండగా..
మొదట గురువుగారు,
తరువాత భీష్మ పితామహ అంటూ..

కవచకుండలాలే అభరణాలైన కర్ణుడు, యుద్దజయశీలుడైన కృపాచార్యుడు,
బ్రహ్మాస్త్రం శస్త్ర విలుకాడు అశ్వద్ధాముడు,
వికర్ణుడు, భూవిశ్రవుడు, అనుకుంటూ..

అన్యాపదేశంగా తన
అపజయాన్ని తానే పలికడం
దుర్యోధనుడి దీనస్థితికి కారణమా?
లేక..
ధిక్కరణ నిర్దేశ దిక్చూచిలో
ధీమా ఓలలాడే గర్వమా?

గాయకవాడ ప్రసాద్