11. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితా : భీష్మ మేవాభి రక్షన్తు భవన్తస్సర్వ ఏవ హి ॥
దుర్భుద్ది, దుర్నీతి, దురాగతం,
దుస్సాహస విన్యాసాలు నిర్భీతిని
కోల్పోయే ప్రమాదం పసిగట్టడానికి
కాలం చరమాంకం కావాలన్నందుకే..
సర్వ సైన్యాధ్యక్షుడు మహారథి
భీష్మ పితామహుడు శత్రు సైన్యాన్ని
తుత్తునీయలు చేయగల ధీశాలని తెలిసి..
వజ్రవ్యూహం, పద్మవ్యూహం
మహావ్యూహం ఏదైనా రచించగలిగే
గురువర్యులు అని తెలిసి కూడా..
మనందరం భీష్మ పితామహుని
కాపాడుకోవాలి అన్నప్పుడు..
ఒక్క శిఖండితో మాత్రమే యుద్ధం
చేయనని భీష్మించుకున్న భీష్ముడిని
రక్షించ కౌరవ సైన్యం అంతా..
మొదటి రోజే పోరాడాలన్న
దుర్యోధనుడు పలుకులు
ఆచార్యుని శక్తిపై అపనమ్మకమా??
లేక..
శిఖండి పరాక్రమ వంతుడు
అన్న జడుపు నమ్మకమా??
గాయకవాడ ప్రసాద్
