అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )ఆదివారం రోజు పెద్దపల్లి మండలం తుర్కలమద్దికుంట గ్రామంలో శ్రీఅంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో గ్రామంలోని శ్రీ రామాలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో… శ్రీ సీతరాముల వారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ …లోకకళ్యాణం కోసం శ్రీరాముడు చూపిన మార్గాలు ప్రతి ఒక్కరు ఆచరించాలి అన్నారు. శ్రీ సీతారామ కళ్యాణం గ్రామంలో జరపడం ఆనవాయితీ అన్నారు. గ్రామంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆ దేవుని దీవెనలతో చల్లగా ఉండాలని  కోరారు. తదనంతరం  అన్నదానం కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా నిర్వాహకులను గ్రామ ప్రజలు అభినందించారు.