12. తస్య సంజనయన్ హర్షం కురువృద్ధ : పితామహ : సింహనాదం వినద్యోచ్చై శ్శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ॥
సలక్షణమేలేని లక్ష్యపెట్టని
పెడబుద్ది, పెడచెవని పేరుగాంచిన
దుర్యోధనుడు పెడదారి పట్టి,
పెద్దలను గౌరవించని గర్వి..
గర్వభంగం కలుగుతుందనే
భయం ఆవహించి సైన్యానికి
ధైర్యం నూరి పోయాలన్న లక్ష్యంతో
అధైర్య పడుతున్నాడని గుర్తించిన
భీష్మ పితామహుడు..
దిక్కులు పిక్కటిల్లేలా ప్రపంచమే
నివ్వెరపోయేలా నిలిచి చూసినా
పరుశురాముడునే ఓడించగల
సామర్థ్యం ఉన్న కురువృద్ధుడు..
దుర్యోధనుడి భయం పోగొట్ట
శంఖంపూని సింహనాదం చేసి
పిరికి గుండెల్లో దైర్యపు మొలకలు
మోలిపించే ప్రయత్నం..
భీష్మ పితామహుడికి
దుర్యోధనుడు బేల పలుకులు
నొప్పించకనా??
లేక..
యుద్ధారంభం సూచకంగా
సిద్దం అవ్వమనా??
గాయాకవాడ ప్రసాద్.
