14. తతశ్శ్వేతైర్హ యైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ మాధవ : పాణ్ణవశ్చైవ దివ్యౌ శంఖా ప్రదధ్మతు :॥
శ్వేతవర్ణాశ్వముల రథం
అధిరోహించిన నరనారాయణుల
దివ్యరూపం కాంచిన సంజయుడు,
గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ప్రస్థావన
తెచ్చిన శ్లోకంగా ప్రసిద్ది కెక్కటంలోనే..
తెలుపుదనమే సత్వగుణమని,
ధర్మమును ప్రతిబింబించేదని,
గంధర్వరాజు చిత్రరథుడు, అర్జునునికి
బహుమతిగా నొసగిన, భుమ్యాకాశాలలో
సంచరించగలిగిన నాలుగు గుర్రాలు
నాలుగు వేదాలని..
పరమాత్మ జీవాత్మకు ప్రతిరూపమే
కృష్ణార్జునులని, లక్ష్మీపతియగు
శ్రీకృష్ణ పరమాత్మ పాంచజన్యం పూరించి..
కౌరపక్షం నుండి రాజ్యలక్ష్మిని
హరించేనని ధృతాష్ట్రునికి
సెలవివ్వడంలోని అంతరార్థం
విజయం పాండవ పక్షం అనా??
లేక..
ఇప్పటికైనా యుద్ధం ఆపమనా??
గాయకవాడ ప్రసాద్
