15. పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయ : పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదర :॥ 16. అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరు నకుల : సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ || 17. కాశ్యశ్చ పరమేష్వాసశ్శిఖర్డీ చ మహారథ : 1 ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజిత :॥ 18. ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే । సౌభద్రశ్చ మహాబాహు : శంఖాన్ దమ్ము : పృథక్ పృథక్ ||

శ్రీకృష్ణ పాంచజన్యం,
అర్జున దేవదత్తం,
బలభీమ పౌండ్రం,
ధర్మరాజు అనంత విజయం,
నకుల సుఘోషం,
సహదేవ మనిపుష్పం..

చేబూని విజయ దుందుభి
విషయ సూచకంగా సమర
శంఖము లూదనారంబించగ,

కాశీరాజు, శిఖండి, దృష్టధ్యుమ్న,
విరాటుడు, సాత్యకేయ, దృపధుడు,
ఉపపాండవులు, అభిమన్యుడు,

సేనాపరివారమంతా వేణువల్లే
దుంధుబిలూదుతుంటే ,
బ్రంహండ మండలాలన్ని నిశ్చేష్ట
భీతినిగొని బిక్కచిక్కిపోగా..

కురుక్షత్రంలో కురుసేన ఆయుష్షు
అర్దం అయిపోయినట్లు అవని
మొత్తం నిర్ధారించుకున్న సందర్భం..

అంతంటా ఆవహించి యున్న
కృష్ణ పరమాత్మ లీలామృత
ధర్మాధర్మ విచక్షణా విస్పోటనం
ఇంద్రియ నిగ్రహలోలునిలోని ఆగ్రహం..

ఇది కౌరవ సేన అంతం కొరకా??
లేక..
లోక పరిరక్షణా ధర్మ సంస్కరణమా??

గాయకావాడ ప్రసాద్