■  బికే పద్మజ  ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం.

■  కార్యక్రమంలోపాల్గొన్నఫారెస్ట్,అధికారులు.           

■  మొక్కలు నాటిన బ్రహ్మకుమారీస్,. బి కే పద్మజ, కమల.

■  ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి అన్న పద్మజ.  

■  ఒక వ్యక్తి, ఒక మొక్క, ఒకే విశ్వం కోసం 40లక్షల మొక్కలు నాటాలి.

అగ్నిధారన్యూస్(  పాల్వంచ ) 50వ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని. బ్రహ్మా కుమారీస్ పాల్వంచ శాఖ.     నిర్వాహకురాలు బి కే పద్మజ  ఆధ్వర్యంలో ఆదివారం రోజు ఏర్పాటుచేసిన  కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా.   పాల్వంచ కిన్నెరసాని ఫారెస్ట్ డివిజన్ అధికారి  దామోదర రెడ్డి   డివిజన్ రేంజ్ అధికారి   శ్రీనివాస రెడ్డిలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బికే పద్మజ మాట్లాడుతూ…...అందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ
*బ్రహ్మాకుమారీస్ వారు కల్పతరూహ్ అనే బృహాత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టామన్నారు* 75వసంతాల ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా 75రోజులుజూన్ 5తేదీ నుండి దాది ప్రకాశ్ మణి  సంస్మరణ దినోత్సవం ఆగస్టు 25తేదీ వరకు నిర్వహించనున్న కార్యక్రమంలో  ఒక వ్యక్తి, ఒక మొక్క, ఒకే విశ్వం కోసం 40లక్షల మొక్కలు నాటే గోప్ప కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అందులో భాగంగా ఆదివారం రోజు  అటవి శాఖ అధికారులు వారి సిబ్బందితో కలసి బ్రహ్మాకుమారీ నిర్వాహకులు పద్మజ మొక్కలు నాటారు. అదేవిధంగా ప్రజలందరూ మొక్కలు నాటల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన  కిన్నెరసాని ఫారెస్ట్ డివిజనల్అధికారి దామోదరెడ్డి  మరియు శ్రీనివాస్ రెడ్డి లు మాట్లాడుతూ….పర్యావరణం అంటే గాలి, భూమి,నీరు, వాతావరణమే కాకుండ మనతో పాటు మొక్కలు, జంతువులు అనేక జీవ రాశులు జీవిస్తున్నాయి  వాటిని కాపాడితేనే మన జీవనం ఉంటుంది అనే సత్యాన్ని తెలుసుకొని మొట్ట మొదటి సారిగా జూన్ 5, 1972 సం!లో స్వీడన్ దేశంలో అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ~వార్షికోత్సవం జరిగిందిఅన్నారు. దాన్నే ఐక్యరాజ్య సమితిలో*( యుఎన్ ఈపి )అనగా యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం* గా ఆమోదం చేసి పర్యావరణంకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అటవి శాఖ అధికారులకు   సిబ్బందికి బి కే పద్మజ , కమల ప్రత్యేక  కృతజ్ఞతలు తెలిపారు.