అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణంలోని ని శ్రీ సరస్వతీ విద్యా పీఠం ప్రారంభమై 49 సంవత్సరాలు పూర్తయి 50 వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని…. శ్రీ సరస్వతి శిశుమందిర్ ప్రధానోపాధ్యాయులు నగూరి  లక్ష్మయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంవత్సరం అంతా స్వర్ణోత్సవాలు జరపాలని నిర్ణయం జరిగింది అన్నారు . కావున రేపు(10-4-2022) ఆదివారం ఉదయం 9 గంటలకు అన్ని పాఠశాలల్లో పెద్ద ఎత్తున స్వర్ణోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా పెద్దపెల్లి లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో కార్యక్రమం నిర్వహిస్తున్నందున విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఆచార్యులు, పూర్వాచార్యులు, ప్రబంధ కారిణి సభ్యులు, పూర్వ ప్రబంధ కారిణి సభ్యులు, పోషకులు పూర్వపోషకులు,హితైషులు అందరూ ఆహ్వానితులే అని తెలిపారు.
.