అగ్నిధార న్యూస్ ( హైదరాబాద్ )బుధవారం రోజున ఉదయం 11 గంటలకు గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం ప్రధమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని GKSS – రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశంను హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్- క్లబ్ నందు ఏర్పాటు చేసుకోవడం జరిగింది………ఈ కార్యక్రమానికి GKSS జిల్లా, రాష్ట్ర బాద్యులు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సభ్యులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షు, ప్రధాన కార్యదర్సులు, పోచబోయిన శ్రీవారి యాదవ్, మారం తిరుపతి యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన పాశం యాదగిరి యాదవ్ మాట్లాడుతూ.……….

గత సంవత్సరం ఏప్రిల్ 13న 2021 BP మండల్ యాదవ్ వర్ధంతి సందర్బంగా గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం కేంద్రంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ యాదవ కళ్యాణమండపంలో ఏర్పాటు చేశామన్నారు. సంఘం ఆవిర్భవించి తేది 13-04-2022 నాటికి సంవత్సరం కాలం ఐన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గొఱ్ఱెల కాపరుల సంక్షేమ సంఘం ముఖ్య ప్రతినిధులచే.
జనరల్ కౌన్సిల్ ని నిర్వహించడం జరిగింది అన్నారు.ప్రధానంగా దేశంలో ఎక్కడా లేని విదంగా మాంసాన్ని దిగుమతి చేసుకునే దశ నుండి ఎగుమతి చేసే రాష్ట్రముగా, దేశంలోనే సంపన్న యాదవులు తెలంగాణలో ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక పథకాల్ని, అభినందిస్తూ, అన్ని జిల్లాల ప్రతినిధులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు వాటి అమలు తీరుతెన్నులు, రైతు బందు, దళిత బందు లాగానే రెండో విడత గొర్రెల పంపిణి డబ్బులు నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు బదిలీ చేయాలనీ డిమాండ్ చేశారు. నియోజకవర్గంనకు ఒక గొర్రెల మరియు మేకల మార్కెట్ యార్డులను, జిల్లాకొక మాంసం మరియు మాంస ఉత్పత్తుల ఎగుమతి కేంద్రాలను మరియు మాంస ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలనీ, జిల్లాకొక రోగనిర్దారణ పరిశోదన, పరిష్కార కేంద్రాలను ఏర్పాటు చేయాలని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు
ప్రాథమిక గొఱ్ఱెల పెంపకందారుల సహకార సంఘాల భాగస్వామ్యం, పర్యవేక్షణలో జరిగే విదంగా చర్యలు తీసుకోవాలని, తెలంగాణలో మిగతా చేతివృత్తుల సామాజిక వర్గాలకు ఇచ్చిన విదంగానే గొఱ్ఱెల కాపరులకు కూడా ప్రమాద బీమాను ఐదు లక్షలు ప్రకటించాలని, 50 సంవత్సరాలు నిండిన ప్రతి గొఱ్ఱెల కాపరికి పెన్షన్ ఇవ్వాలనే ప్రధాన డిమాండ్ల పై చర్చించి భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధం చేయడం జరిగింది. అదే విదంగా కేంద్ర ప్రభుత్వం అదీనంలోని NCDC ఇప్పటికే ఇచ్చిన లోన్లను మాఫీ చేయాలనీఅన్నారు. భవిష్యత్తులో తెలంగాణలోని యాదవ, కురుమ మరియు గొఱ్ఱెల కాపరులు ఆత్మగౌరవంతో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలలో మన జనాభా నిష్పత్తి ప్రకారం వాటా సాదించు కోవడానికి ఐక్య ఉద్యమాల గురించి, అంతిమంగా సకల సామాజిక రంగాలలో సంక్షేమ అభివృద్ధి ద్యేయంగా పనిచేయాలని వక్తలు చూసించారు.ఈ కార్యక్రమంలో చాలకాని. వెంకటేష్ యాదవ్, రమేష్ యాదవ్, కురుమూర్తి యాదవ్ ,మల్లేష్ ,అయోధ్య ,నాగరాజు, మల్లేశం ,నర్సయ్య ,శ్రీనివాస్ ,చంద్రమౌళి, లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

