రంజాన్ శుభాకాంక్షలు తెలిపి వస్త్రాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )మండలంలోని 667కి ముస్లిం సోదర సోదరిమణులకు రంజాన్ పండుగ పురస్కరించుకుని ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మండలoలోని ఎంపీడీఓ కార్యాలయంలో వస్త్రల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముస్లింలకి రంజాన్ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడుతూ ….…కుల మత భేదం లేకుండా అందరం ఒకటే అన్నారు. సర్వ మతాలు సమానమన్నారు. ప్రతి ఒక్కరూ ప్రేమానురాగాలతో ఉండాలని సూచించారు. మన పూర్వీకులు మనకి చెప్పిన ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాపాడాలన్నారు. పెద్దపల్లి పట్టణంలో అన్ని కులాల, మతాల వారు వరుసలు పెట్టి పిలుచుకోవడం గొప్ప విషయమన్నారు అన్నారు. రంజాన్ పండుగను ఆనందంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తహశిల్దార్ శ్రీనివాస్ బండారి స్రవంతి శ్రీనివాస్,జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, వైస్ ఎంపీపీ ముత్యాల రాజయ్య, ఆర్ ఐ వరలక్ష్మి మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ నజ్మీన్ సుల్తానా-మోబిన్,పట్టణాధ్యక్షుడు,ఇమామ్ లు,కౌన్సిలర్ లు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ప్రజా ప్రతినిధులు, , నాయకులు, పాల్గొన్నారు.

