యువత గణాంకాలు చూస్తే గర్వంగా ఉంది.

విద్యార్థుల సామర్థ్యాలపైన  సెల్ ఫోన్ దాడి  పెడదారి పడుతున్న యువత.

యువత సన్మార్గంలో ప్రయాణించాలి సుల్తానాబాద్ సిఐ ఇంద్రసేనారెడ్డి.

కౌన్సిలింగ్ అవసరమే అంటున్న సైకియాట్రిస్ట్ డాక్టర్ సాధ్వి మైథిలి.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )

నేడు, ( యువత ) అరువు తెచ్చుకున్న ఆధునిక పోకడలతో , మన ఆచార, వ్యవహారాల పై ప్రాశ్చాత్య నాగరికత  దాడి చేసి పతనం చేస్తుంది…. ప్రపంచంలో  ఏ దేశంలో లేనంతగా యువత మన దేశంలో ఉన్నారని గణాంకాలు చెప్తా ఉంటే గర్వంగా అనిపిస్తుంది. మన దేశ యువత శక్తి సామర్ధ్యాలు ఏంటో ( ప్రతిభలో ) ప్రపంచ దేశాలకు తెలుసు… కానీ   సన్మార్గంలో నడవాల్సిన యువత కొంతమంది పెడదారి పడుతున్నారు .ఈ మధ్య కాలంలో . ప్రేమ పేరుతో కొందరు, గంజాయి,మద్యం మత్తుకు,బానిసై మరికొందరు, జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడుతున్నవారు ఇంకొందరు, రకరకాలుగా యువత చెడు మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థులు బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు.  కరొన ముందు కరొన తర్వాత అని చెప్పుకోవచ్చు ,కరొన కాటుకు పాఠశాలలు, కళాశాలలు మూతపడడం వల్ల విద్యార్థులు మానసిక సంఘర్షణకు లోనయ్యారు. ఆన్లైన్ లో విద్య , పేరుతో కొనసాగినప్పటికీ ఎంతవరకు ఫలితాలు వచ్చాయి, అనేది పక్కన పెడితే ,విద్యార్థులను మాత్రం సెల్ ఫోన్ ని దగ్గర చేసింది. తద్వారా సోషల్ మీడియా కి వాట్సాప్, ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ ,ట్విట్టర్ ,ఆన్లైన్ గేమ్స్, అలవాటుపడి  విద్యార్థుల మానసిక సామర్థ్యాలపై పై సెల్ ఫోన్ దాడి చేసింది. విద్యార్థికి సెల్ ఫోన్ దగ్గర కావడం ద్వారా మంచి కంటే చెడే ఎక్కువ జరిగిందని నిపుణులు, విశ్లేషకులు, పిల్లల తల్లిదండ్రులు చెప్పే మాట .ఎక్కువ సమయం సెల్ ఫోన్ తో గడపడం ద్వారా తమ పిల్లలు ఏమి చేస్తున్నారో గ్రహించని తల్లిదండ్రులు గ్రామాల్లో ఎక్కువగానే ఉన్నారు. వాట్సాప్, ఫేస్బుక్, చాటింగ్ లతో ,తెలిసీ, తెలియని వయసులో మైనారిటీ తీరని వారు కొందరు, మైనారిటీ తీరిన వారు ఇంకొందరు. యువత ప్రేమ అనే వలయంలో చిక్కుకొని తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ మానసిక వేదనతో కొందరు .బతుకు చాలించిన వారు ఇంకొందరు. పెద్దపల్లి జిల్లాలో ఈ మధ్యకాలంలో ఎక్కువగానే కనబడుతున్నారు. పెడదారి పడుతున్న యువతకు గ్రామాల్లో పట్టణాల్లో పాఠశాలలో, కళాశాలలో, కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది .తద్వారా కొంతవరకు యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా నివారించవచ్చు.

సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి అగ్నిధారతో మాట్లాడుతూ…. యువత తల్లిదండ్రులకి, పుట్టి పెరిగిన ప్రాంతానికి, మంచి పేరు తెచ్చే విధంగా ఆలోచన విధానం ఉండాలి. ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి ,చేరే మార్గాలను అన్వేషించాలి. క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకొని బంగారు భవిష్యత్తు చేజేతులారా నాశనం చేసుకోవద్దు. ఒక్కసారి కేసు నమోదు అయితే ఎలాంటి ఉద్యోగానికి కూడా అర్హులు కాకుండా పోతారు. తల్లిదండ్రులు పెద్దలు చెప్పే మాటలు పిల్లలు గౌరవించాలి. ఈ మధ్యకాలంలో యువత జల్సాలకు అలవాటుపడి విచక్షణ కోల్పోతున్నారు. విజ్ఞతతో ఆలోచించాలి. నేటి పోటీ ప్రపంచంలో పోటీ కష్టపడి చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలి . ఆ వైపుగా యువత ప్రయాణించాలి. పోలీస్ శాఖ పక్షాన సన్మార్గంలో వెళ్లే వాళ్లకి ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. అక్రమ మార్గంలో ప్రయాణించే వాళ్ళ పై నిరంతరం నిఘా ఉంటుంది.

డాక్టర్ సాధ్వి మైథిలి మానసిక వైద్యునిపుణురాలు ……..బాల్యం కల్లాకపటం లేని వయసు అంటారు. కేవలం తమ అవసరాల గురించి మాత్రమే ఆలోచిస్తారు. కానీ
కొమర దశలో తమ గురించి, అలాగే ప్రపంచం గురించి ఎంతో అయోమయంలో ఉంటారు .
సొంత మైన అభిప్రాయాలు ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉంటారు. అందుకే తల్లిదండ్రుల మాటకు ఎక్కువసార్లు ఎదురు చెబుతూ ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ వయసులో పిల్లలతో స్నేహంగా మెలగాలి. పిల్లలను అదుపు చేయాలి, అనే ధోరణి కంటే స్నేహపూర్వకంగా ఉండాలి. తెలిసి తెలియని వయసు పిల్లలు ఈ మధ్య కాలంలో ప్రేమ అనే వలయంలో చిక్కుకొని చాలా మంది పిల్లలు సతమతమవుతున్నారు. మంచి చదువు, ఉద్యోగం, వ్యాపారం, జీవితాశయం లక్ష్యంగా, ఆలోచన ఉండాలి. క్షణికావేశాలకు లోనుకాకుండా యువత సంయమనం పాటించాలి.తల్లిదండ్రులు పిల్లలకు మొబైల్ ఇస్తున్నప్పుడు, మొబైల్లో ఏం చేస్తున్నారో, కనిపెడుతూ ఉండాలి. అలాగే భద్రతకు సంబంధించిన ఫీచర్స్ ఉపయోగించాలి. పిల్లలపైన తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి. సున్నిత విషయాలను సున్నితంగా పరిష్కరించుకోవాలి, కౌన్సిలింగ్ ద్వారా వ్యక్తులలో మార్పులు తీసుకురావచ్చు. మన జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కౌన్సిలింగ్ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. పాఠశాలలో ,కళాశాలలో ,విద్యార్థుల కోసం కౌన్సిలింగ్ నిర్వహించడానికి పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పక్షాన మేము ఎప్పుడైనా సిద్ధం.