అగ్నిధార న్యూస్ (నస్పూర్)
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీరాంపూర్ పట్టణంలోని ప్రధాన రహదారిపై శనివారం మధ్యాహ్నం మామిడిపండ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పి బోల్తా పడింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి మంచిర్యాల వైపు వెళ్తుండగా డివైడర్ను అనుకుని లారీ బోల్తా పడింది దీంతో లారీ లో ఉన్న మామిడి పండ్లు రోడ్డుపై పడిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
