■ అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న ఏసిపి గిరి ప్రసాద్.
■ అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.
■ 103 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం.
అగ్నిధారన్యూస్( మంథని )రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జిల్లా మంథని సర్కిల్-ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్, దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుని అరెస్ట్ వివరాలు శనివారం రోజు వెల్లడించారు.
నిందితుని వివరాలు:
బండ సంపత్ s/o రాజేశం వ.32సం.లు కులం. మున్నూరు కాపు, నివాసం.సోమగుడెం, కాసిపేట మం.మంచిర్యాల జిల్లా
■ వివరాల్లోకి వెళితే
తేదీ 09.05.2022 నాడు మంథని పట్టణం సుభాష్ నగర్ లో పొన్నం శ్రీనివాస్ మరియు పొన్నం చంద్రయ్య లు వారి కుటుంబ సభ్యులతో దైవ దర్శనానికి యదాద్రికి వెళ్ళారు, రాత్రి ఎవరు లేని సమయం చూసి గుర్తు తెలియని వ్యక్తులు వారి ఇండ్ల తాళాలు పగలగొట్టి విలువైన బంగారు ఆభరణాలు , నగదు దొంగలించినారు ,అని ఇచ్చిన పిర్యాదు మేరకు మంథని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. మంథని పట్టణం లోని సీసీ కెమెరాల ద్వారా నిందుతుడు బండ సంపత్ కాసిపేట మండలం, మంచిర్యాల జిల్లా వాసుడిగా గుర్తించి శనివారం రోజు సోమగుడెంలోని అతని ఇంటి దగ్గర అదుపులోకి తీసుకొని విచారించగా మంథనిలో చేసిన దొంగతనం ఒప్పుకున్నాడు అన్నారు. నిందితుని దగ్గర నుండి 103 గ్రాముల బంగారు ఆభరణాలు, రూపాయలు 15,000/- నగదు స్వాధీన పరచుకుని అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. నిందితుడు గతములో పలు దొంగతనాల కేసులలో పిడి యాక్ట్ లో జైలుకు వెల్లివచ్చాడు, అన్నారు. శనివారం రోజు రిమాండ్ నిమిత్తం నిందుతున్ని కోర్ట్ లో హాజరు పర్చడం జరుగుతుందని తెలిపారు.

■ నిందితుని వద్దనుండి స్వాధీనపరుచుకున్న వివరాలు.
1) 69 గ్రాముల చంద్రహారం
2)28 గ్రాముల నల్లపూసల గొలుసు
3) 6 గ్రాముల రెండు జతల చెవి దిద్దులు
4) రూ 15,000/- ల నగదు.
నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన మంథని సి.ఐ సతీష్, యస్.ఐ చంద్ర కుమార్, మహేందర్ యస్.ఐ (సీసీయస్),
సిబ్బంది సతీష్ (సీసీయస్), కిరణ్, సదానందం, రాజ్ కుమార్ లను ఎసిపి అభినందించారు.
