అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )శనివారం రోజు పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో విద్యార్థి సంఘ నాయకులు బాలసాని లెనిన్ ఆధ్వర్యంలో గ్రామ స్థాయిలో నిర్వహించిన మన కొత్తపల్లి ఛాంపియన్స్ టోర్నీ విజేతలకు బహుమతులు అందచేయడానికి పెద్దపల్లి తహశిల్దార్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై విజెతలకు ట్రోఫీ తో పాటు 2016 రూపాయల ప్రైజ్ మని అందజేసిన అనంతరం మాట్లాడుతూ…… గ్రామీణ,పట్టణ ప్రాంతంలో యువకులు క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండి క్రీడల్లో రాణించాలి అన్నారు. పరిస్థితుల్లో యువకులు చెడు వ్యసనాలకు గురి అవుతున్నారని అన్నారు.
నచ్చిన క్రీడను ఎంచుకుని ఆరంగంలో ముందుకెళ్లాలని రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడలలో రాణించాలని అన్నారు. అదేవిధంగా క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడల కోటలో ఉద్యోగాలు వచ్చే అవకాశం ఎక్కువ అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రేమ్, అశోక్, శ్రావణ్ ,రాజేందర్, వెంకటేష్ ,సతీష్ ,తిరుమలేష్ ,అవినాష్ ,వంశీ ,సతీష్, అశోక్ ,మహేష్ ,రాకేష్, దేవేందర్, తదితరులు పాల్గొన్నారు
