రోడ్డు ఆక్రమిత వ్యాపారం చేస్తే చర్యలు తప్పవు….

 రోడ్డు మీద వ్యాపారం ప్రజల కు అసౌకర్యం.

జండా చౌరస్తా లో నిర్వహించిన స్పెషల్ డ్రైవ్ లో పాల్గొన్న ఏ సి పి సారంగపాణి.

అగ్నిధారన్యూస్(  పెద్దపల్లి ):పెద్దపల్లి జిల్లాలోని   పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెద్దపల్లి ఏ సి పి సారంగపాణి  స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో, భాగంగా రోడ్డుకిరువైపులా ఆక్రమిత  ప్రాంతంలో  వ్యాపారం చేస్తూ,   వ్యాపార వస్తువులను, వారి షాపుల ముందు ఉంచడం ద్వారా   రోజురోజుకు పెరుగుతున్న, జన సముదాయం దృశ్య, పట్టణంలోని  రోడ్లన్నీ, జన సమూహాలతో వాహనదారుల తో, రోడ్డుకిరువైపులా తినుబండారాలు,  షాపులు, టీ స్టాల్స్ ,హోటల్లు, ఫ్లెక్సీలు, హోర్డింగ్ లతో, ప్రధాన కూడళ్ళలోనే కాకుండా రాజీవ్ రహదారికి ఇరుపక్కల వ్యాపార సముదాయాలతో, వచ్చిపోయే జనంతో, ఆయా ప్రాంతాలు కిటకిటలాడుతుంది. అదేవిధంగా పెద్దపల్లిలో రోజురోజుకి ప్రమాదాలు సంఖ్య కూడా భారీగానే పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోప్రజల సౌకర్యార్థం ఎసిపి సారంగపాణి, సీఐ ప్రదీప్  కుమార్ అనిల్ కుమార్ ,ఎస్సై రాజేష్,లు వ్యాపారం చేసే వారితో బుధవారం రోజు  మధ్యాహ్నం జండా చౌరస్తా కూడలిలో   వ్యాపారస్తులకు,షాపుల వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ నిర్వహించడంతోపాటు, సత్వరమే రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమిత వ్యాపార సముదాయాలను తొలగించాలని ఆదేశించారు. లేనియెడల చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ  లు సహదేవ్ సింగ్ మౌనిక ఏ ఎస్ జాహెద్   పోలీస్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.