*రాత్రి వర్షం కారణంగా రోడ్డు పై కూలిన చెట్లను తొలగించిన జన్నారం ఎస్ఐ*

అగ్నిధార న్యూస్ మంచిర్యాల రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతగూడ గ్రామం నుండి ఇందనపల్లి బ్రిడ్జి వెళ్లే రహదారిపై అకాల వర్షం, బలమైన ఈదురుగాలి కారణంగా, రోడ్డుపై చెట్లు కూలీపోవడం జరిగింది. రోడ్డుపై  వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఉంది అనే సమాచారం మేరకు జన్నారం ఎస్ఐ సతీష్  జెసిబి లు తెప్పించి ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, రోడ్డు పై పడిన చెట్లను తొలగింప చేశారు.ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగ కూడదనే అనే మంచి ఉద్దేశంతో  వెంటనే స్పందించిన జన్నారం ఎస్ఐ సతీష్, మరియు సిబ్బందిని ప్రజలు వాహనదారులు అభినందిస్తున్నరు .