■ *బీర్కూర్ లో వైన్స్ లో బీర్ల కల్తీ*
■ *ఓ వైన్ షాప్ ముందు కల్తీ బీరు బాధితుడు ఆగ్రహం*
■ *అన్ని బ్రాండ్లను కల్తీ చేస్తున్నారంటూ మందుబాబుల ఆగ్రహం*
■ *కామారెడ్డి బీర్కూర్ మాత్రమే రాష్ట్రమంతా కల్తీ దందా*
■ *ఎక్సైజ్ శాఖ ఏం చేస్తుంది కల్తీని మందును అరికట్టడంలో విఫలం*
■ *బెల్టు షాపులను ప్రోత్సహిస్తున్న ఎక్సైజ్ శాఖ*
■■■ ( *పెద్దపల్లి జిల్లాలో కూడా మద్యం జోరుగా కల్తీ దందా * )
■■■ ( *పర్యవేక్షణ కరువైన ఎక్సైజ్ శాఖ అంటూ మందుబాబుల ఆగ్రహం* )
*అగ్నిధారన్యూస్( కామారెడ్డి )* ఎండాకాలం అనగానే…. ముందుగా మందుబాబులకు గుర్తొచ్చేది చిల్డ్ బీరు. అలాంటి బీరు తాగుదామని వైన్స్ కొచ్చిన మందుబాబులకు చేదు అనుభవం ఎదురైంది. చల్లగా ఉంటే సరిపోతుంది, ఎవరు గుర్తు పడతారు అనుకున్నాడో ఏమో ఆ సదరు వైన్స్ షాప్ వాళ్లు..కానీ దీన్ని పసిగట్టిన మందు బాబు బీరు నీళ్ల లాగానే ఉంది, కిక్కు లేదు, నురగ లేదు అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా అది చెక్కర్లు కొడుతుంది. కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలంలోని ఓవైన్స్ లో గత కొన్ని రోజులుగా కల్తీ బీర్లు అమ్ముతున్నట్లు వదంతులు వ్యాపించాయి. దీనికితోడు మందుబాబులు ఇక్కడ బీర్లు బాగాలేవనీ, తప్పు ఎక్కడ జరుగుతున్నా మేంమాత్రం నష్టపోతున్నారని వారు ఆరోపించడంతో అగ్నికి ఆజ్యం పోసినట్లయింది.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలో మందు బాబు తీసిన వీడియో హల్ చల్.
ఇదిలా ఉంటే మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద ఏర్పాటుచేసిన ఈ వైన్స్ షాప్ మూడు రోడ్ల కూడలిలో ఉన్నందున వాహనదారులకు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే ఈ రోడ్లలో మూలమలుపులోనే ఈ వైన్స్ ఉండడం పట్ల మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ప్రదేశాలలో మద్యం షాపు ఉండడంవల్ల వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి,
పెద్దపల్లి జిల్లాలో వైరల్ అవుతున్న వీడియో
పలుమార్లు ఆక్సిడెంట్లు సైతం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇటువైపు దృష్టి పెట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉన్నత అధికారులు దీనిపై దృష్టి పెట్టి నకిలీ వ్యవహారాన్ని అరికట్టాలని కోరుతున్నారు. ప్రమాదాలకు నిలయం మైన ఇలాంటి ప్రదేశాలలో వైన్స్ ఉండడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
