అగ్నిధారన్యూస్(  కొలనూర్ )ఓదెల మండలం కొలనూరు గ్రామంలో సుల్తానాబాద్ టూ కాల్వ శ్రీరాంపూర్ వెళ్లే రహదారి పైన ఆదివారం రోజు సాయంత్రం పొత్కపల్లి ఎస్ ఐ లక్ష్మణ్ తన సిబ్బందితో కలిసి .  డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ……..మద్యం తాగి వాహనాలకు నడపడం వలన ప్రమాదాలు జరిగి తొటి వాహనదారులకు వీరివలన ప్రమాదం జరిగినపుడు ,వారు ఏలాంటి తప్పు లేకుండా ప్రాణాలను కోల్పోవడం, లేదా ,బలమైన గాయాల బారినపడడం జరుగుతుందని ,తాగడం వలన వాహనం సరైన పద్దతిలో నడిపే విచక్షణ కొల్పోవడం జరుగుతుంది అని అన్నారు. మద్యం తాగి వాహనాలను నడిపి ప్రమాదాలకు గురై ,తనను నమ్ముకున్న కుటుంబ సభ్యులను ,పిల్లలను అనాథలను చేయవద్దని మందుబాబులకు సూచించారు. మద్యం  తాగి వాహనాలు నడిపితే వాహనాలను  సీజ్ చేయడమే కాకుండా   కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.