■ కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ అధికారి రవీందర్ రాజు స్పందన.
■ ఎక్సైజ్ శాఖ సిఐ యాదగిరి రెడ్డికి ఆదేశం సిబ్బందితో కలిసి వైన్ షాప్ లో తనిఖీలు.
■ బీర్కూర్ వైన్స్ ను తనిఖీ చేసిన అధికారులు.
■ కొచ్చేరి మైసమ్మ వైన్స్ ని బాన్సువాడ ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి తనిఖీ.
■◆◆◆అగ్నిధార న్యూస్ ఎఫెక్ట్●●●●●
అగ్నిధారన్యూస్( కామారెడ్డి జిల్లా ) బీర్కుర్ మండలం లో కల్తీ బీర్ల దందా”* అనే శీర్షికతో.... ఆదివారం రోజున *అగ్నిధార దినపత్రికలో ప్రచురితమైన కథనానికి* కామారెడ్డి జిల్లా ఎక్సైజ్ అధికారి రవీందర్ రాజు స్పందించారు. ఆయన ఆదేశాల మేరకు బీర్కుర్ మండలం లోని కొచ్చేరి మైసమ్మ వైన్స్ ని బాన్సువాడ ఎక్సైజ్ సిఐ యాదగిరి రెడ్డి తన బృందంతో కలిసి తనిఖీలు నిర్వహించారు. షాపులోని మద్యం సీసాలను,బీర్లను, నిశితంగా పరిశీలించారు. రోడ్ల కూడలిని పరిశీలించి, అక్కడికి వచ్చిన వినియోగదారులతో బీరు సీసా ని ఓపెన్ చేసి ప్రాక్టికల్గా ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. వైన్ షాప్ లో అమ్ముతున్న వాటర్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్, గ్లాసులు తదితర వస్తువులు షాప్ లో అమ్మరాదని హెచ్చరించారు. వైన్ షాప్ లో సంబంధం లేని వస్తువులు అమ్మితే చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. కస్టమర్ల తో వాగ్వాదానికి దిగడం వల్ల పలు సమస్యలు ఏదురవుతాయని, లీకేజ్ ఉన్న బీర్లను కస్టమర్లకు ఇవ్వరాదని సూచించారు. ఆయన వెంట ఎక్సైజ్ ఎస్ఐ తేజస్విని, కానిస్టేబుల్స్ ఉన్నారు.

అగ్నిధార పత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనం.
