బీర్పూర్ మం. తుంగూరు లో అధికారులపై పెట్రోల్ చల్లిన గంగాధర్ అనే వ్యక్తి.
అప్రమత్తమై పరుగులు తీసిన అధికారులు.
ఖండించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.
నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఎంపీఓ సంఘం డిమాండ్.
అగ్నిధారన్యూస్ జగిత్యాలజిల్లా మంగళవారం రోజు విచారణ నిమిత్తం వెళ్లిన అధికారులపైన పెట్రోల్ స్ప్రే చేసి లైటర్ తో నిప్పు పెట్టిన దురదృష్టకరమైన సంఘటన జగిత్యాల జిల్లాలో పెను సంచలనం సృష్టించింది వివరాల్లోకి వెళితే… బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో వివాదాస్పదమైన దారి విషయంలో విచారణకు వెళ్లిన అధికారులు ఎస్ ఐ ,ఎమ్మార్వో ,డి ఎల్ పి ఓ, ఎం పి ఓ, సర్పంచ్, మరియు గ్రామ ప్రజలు వెళ్లి విచారణ జరుపుతున్నసమయంలో ఫ్రీ ప్లాన్ గా ఉద్దేశపూర్వకంగా చుక్క గంగాధర్ అనే వ్యక్తి పొలాలకు స్ప్రే చేసే పెట్రోల్ పంపుతో విచారణకు వచ్చిన అధికారులపై పెట్రోల్ స్ప్రే చేసి నిప్పు అంటించే క్రమంలో. అప్రమత్తమైన అధికారులు ప్రజలు సంఘటన స్థలం నుండి పక్కకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. అక్కడే ఉండి వారిస్తున్న ఎం పీ ఓ రాజు కి స్వల్ప గాయాలయ్యాయి బాధితుడు రాజుని జిల్లా ప్రభుత్వ హాస్పటల్ కి హుటాహుటిన తరలించారు …. హాస్పటల్ ని సందర్శించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ జరిగిన ఘటన దురదృష్టకరమని, ఈ దుచ్చర్యను ఖండిస్తున్నానని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు., అధికారులపై దాడి జరిగిన విషయం తెలియగానే జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి వెళ్లి కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న ఎంపీవో రామకృష్ణ రాజును ఎమ్మెల్యే పరామర్శించారు. ప్రమాదం నుంచి బయట పడ్డ ఎస్ ఐ కి ఫోన్ చేసి దైర్యంగా ఉండాలని సూచించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడుతూ….అధికారుల పై పెట్రోల్ చల్లి నిప్పంటించడం దురదృష్టకరమని అన్నారు. 8 ఇళ్లకు వెళ్లే దారిని ఓ వ్యక్తి అక్రమించి ఇబ్బందులు సృష్టించిన నేపథ్యంలో బాధితులు జిల్లా కలెక్టర్ ను కలిశారని, కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణకు వెళ్లిన అధికారులపై పెట్రోల్ చల్లి నిప్పంటించినట్లు తెలిసిందన్నారు., అదృష్టవశాత్తు పెట్రోల్ తో తడిసిపోయిన ఎస్ ఐ అక్కడినుంచి దూరంగా పరుగెత్తడంతో ప్రాణాలతో బయట పడ్డాడని, అడ్డుకున్న ఎంపిఓ కు మంటలు అంటుకున్నాయని వివరించారు. ఎం పి ఓ వెంటనే అప్రమత్తమై తన శరీరం పై ఉన్న షర్ట్ ను తొలగించడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు., ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లి చట్ట ప్రకారం పరిష్కరించుకోవాలే తప్పా ఇలాంటి ఘాతుకానికి పాల్పడటం సరి కాదన్నారు సంఘటనను ఖండించిన ఎంపీవోల సంఘం నిందితుని కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ కు వినతి…..,బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని జగిత్యాల జిల్లా ఎంపీవోల సంఘం అధ్యక్ష ,కార్యదర్శులు రవిబాబు ,మహేందర్ ,గౌరవ అధ్యక్షులు అబ్జాల్ మియా, సుష్మ నరేష్ కుమార్ సతీష్ కుమార్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీఓల సంఘం జిల్లా అధ్యక్షుడు రవిబాబు మాట్లాడుతూ… గతంలో మల్టీ వర్కర్ పైన చుక్క గంగారెడ్డి దాడి చేశారన్నారు. అప్పుడే నిందితుని ఉపేక్షించకుండా శిక్షించినట్లయితే ఈరోజు ఇలాంటి సంఘటన పునరావృతం అయ్యేది కాదేమో అన్నారు. అధికారులకు ప్రజలపైన అపారమైన ప్రేమే తప్ప ఏ ఒక్కరికి అన్యాయం చేయాలని ఆలోచన ఉండదు అన్నారు. ఉద్యోగులను శత్రులాగా, చంపేంత ,శత్రుత్వం, పెంచుకోకుండా, స్నేహితులుగా చూడాలన్నారు.
