*మహాత్ముల జీవితాలు మరపురానివి*జడ్పీ చైర్ పర్సన్ పుట్టమధుకర్*
*అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )* మంగళవారం మహారాష్ట్ర లోని పొహరాదేవిలో గల సేవాలాల్ మహరాజ్ సమాధిని స్థానిక గిరిజన, బహుజన నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. లిపిలేని భాషను ఒక పద్దతిగా మార్చి బంజారల సంస్కృతిని కాపాడిన గిరిజనుల ఆరాధ్య దైవంమహసేవాలాల్రాజ్ అని జిల్లాపరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ కొనియాడారు.చిన్నతనం నుంచే ఆయనలో సేవాగుణం ఉండేది. ఆవులు కాయడానికి వెళ్తేటప్పుడు తల్లి కట్టిచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్నవాళ్లకు పెట్టేసే వాడు. తాను బంకమట్టితో రొట్టెలు చేసుకొని తినేవాడు. ఈ వింత ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని జనాలకు ఆశ్చర్యం ఉండేదన్నారు. జాతర్ల సమయంలో జంతుబలిని ఒప్పుకునేవాడు కాదు. ‘ఒకవేళ అమ్మవారికి బలి ఇష్టమైతే నేనే బలై పోతాను’ అని విద్యలను నేర్చుకొని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు. సేవాలాల్ మహరాజ్ ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు. వీరిలో ‘పెరిఫర్’ ఒకటి. ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడులు అరికట్టడం, క్షేత్ర ధర్మాన్ని రక్షించడం మొదలైనవి ముఖ్యమైనవి. అహింస మహా పాపమని, మద్యం ,ధూమ పానం శాపమని హితవు పలికాడు. ఆ రోజుల్లో నే బంజారాల పరువు ప్రతిష్టల గురించి ఊహించి అహింస సిద్ధాంతానికి పునాది వేశాడు. సామాన్యునిగా పుట్టి అసామాన్యునిగా ఎలా ఎదగాలో ఆచరించి చూపిన మహానుభావుడు సంత్ శ్రీ సేవాలాల్. మనిషి మనీషిగా ఎలా ఎదగాలో నేర్పినవాడు. ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అందరూ ఆచరించాలి. మహారాష్ట్రలోని పౌరాగఢ్ లో తుది శ్వాస విడిచారు. ఆయన జయంతి, వర్ధంతులను ఏటా అక్కడ ఘనంగా నిర్వహిస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం ఈ ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు.ఆయన వెంట నాయకులు జక్కు రాకేష్, పూదరి సత్యనారాయణ గౌడ్, తగరం శంకర్ లాల్, పూల్ సింగ్, శీలారపు లక్ష్మన్, అజ్మీర సమ్మయ్య తదితరులు ఉన్నారు.

