గుర్తుతెలియని దుండగులచే దంపతుల హత్య
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) క్రైమ్:పెద్దపల్లి జిల్లా మంథని మండలం పుట్టపాక గ్రామపంచాయతీ పరిధిలోని చల్లపల్లిలో బుధవారం సాంబయ్య ,లక్ష్మి అనే వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన పెద్దపల్లి జిల్లాలో కల కలం సృష్టిస్తుంది. వేసవి కాలం కావడంచేత ఆరుబయట నిద్రిస్తున్న ? దంపతులను గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హతమార్చారు. స్థానికుల సమాచారం మేరకు మంథని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
