డయాలసిస్ పేషేంట్స్ ను ప్రభుత్వ ఆదుకోవాల మద్దెల దినేష్
అగ్నిధారన్యూస్( రామగుండం )గోదావరిఖని ప్రాంతంలోని నీడ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పల్లెర్ల రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివి అని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మద్దెల దినేష్ అన్నారు, గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో ఒక నిరుపేద డయాలసిస్ బాధితునికి దినేష్ చేతుల మీదుగా పెన్షన్ అందించడం జరిగింది.
అనంతరం అయిన మాట్లాడుతూ డయాలసిస్ పేషంట్స్ కు గత రేండు ఏండ్ల నుండి వారి సాధక బాధలను అర్ధం చేసుకుని పేదరికంలో ఉన్నవారిని చూసి తనకు తోచిన విధంగా మరియు మిత్రుల ప్రోత్సహం ద్వారా ప్రతి నెల డయాలసిస్ బాధితులకు 521 రూపాయలు ఆరోగ్యమస్థు పేరుతో పెన్షన్ తన సంస్థ ద్వారా ఇవ్వడం చాలా గొప్ప విషయమని రమేష్ ని అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆసరా పెన్షన్ వలే డయాలసిస్ పేషంట్స్ బాధలను అర్ధం చేసుకుని నెలకు పదివేల రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలి, మరియు పేషంట్ తో పాటు ఒకరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని అదే విధంగా దురదృష్టవశాత్తు డయాలసిస్ పేషంట్ మృతి చెందితే వారి కుటుంబం రోడ్డున పడకుండా అయిదు లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణికుంట్ల నరేంద్ర, సిహెచ్ వివేక్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారన్నారు.

