అగ్నిధార న్యూస్ ,మంథని:
పెద్దపల్లి జిల్లా రామగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్యగౌడ్ MPDO విజయ్ కుమార్ ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రామగిరి ఎంపీడీవో కార్యాలయంలో వాల్మీకి చిత్ర పటానికి పూలమాల వేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ వాల్మీకి మహర్షి జయంతిని రాష్ట్ర పండుగగా జరుపుకోవడం ఆనందదాయకమని అన్నారు. రామాయణాన్ని రసరమ్యంగా లిఖించి భావి తరాలకు అందించిన గొప్ప వాడని కొనియాడారు. ఈ సందర్బంగా మండల ప్రజలకు, నాయకులకు, అధికారులకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల మహిళ అధ్యక్షురాలు ఆశకుమారి, ఉపాధ్యక్షురాలు మండల ఓదెక్క, కార్యాలయ పర్యవేక్షకులు శంకర్ రెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శిలు, ఎంపీడీఓ కార్యాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
